కాంగ్రెస్ పార్టీ తుమ్మ గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిగా రామన్న..!!

01-10-2026 | 06:56pm

మోతె,(విజయ క్రాంతి): మండల పరిధిలోని తుమ్మగూడెం కాంగ్రెస్ పార్టీ(Congress Party) గ్రామ శాఖ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు విరండి రామాచారి(Virandi Ramachary) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.

గ్రామంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ తరఫున నిరంతరం కృషి చేయాలని సూచించారు.నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా తంతెనపల్లి ఉమాశేఖర్, ప్రధాన కార్యదర్శిగా దుంపటి మల్లయ్య, సహకారదర్శిగా ములకలపల్లి శంకర్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు విరండి రామాచారి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడకండ్ల లక్ష్మారెడ్డి, నల్లు మధుసూదన్ రెడ్డి, నల్లు నారాయణరెడ్డి, కొమ్మపట్ల లక్ష్మీనరసయ్య శాస్త్రి, ఉపసర్పంచ్ ఉబ్బపల్లి ఈదయ్యతో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు