డైట్ అంటే బరువు తగ్గడం కాదు!
ఆహార నియమాలు(Dietary Guidelines), ఆరోగ్యజీవన విధానాల(Healthy lifestyle practices)పై ప్రముఖ డైటీషియన్ సాలికా బేగం(Salika Begum)
డైట్.. అంటే కేవలం బరువు తగ్గడమేనా? రోజూ మనం తినే ఆహారమే శరీరం, మెదడు, జీర్ణ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తాయి. మన ప్లేట్లో అసలు ఏముండాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం? అనే సందేహాలు అందరిలో ఉంటాయి. ఆ సందేహాలపై ప్రముఖ డైటీషియన్(Dietitian), సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఇంటిగ్రేటివ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ సాలికా బేగం పలు విషయాలను ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు.
అసలు కారణం ఏంటో తెలుసుకుంటే!
డైట్ పాటించడం అంటే తక్కువ తినడమో, వాకింగ్(Walking) చేయడమో కాదు. మనలో వచ్చిన మార్పులకు గల అసలు కారణమేంటి? అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. ఉదాహరణకు పొయ్యి మీద పాలు పొంగుతున్నప్పుడు నీళ్లు చల్లుతుంటారు చాలామంది. కానీ.. గిన్నె కింద మంట ఎక్కువగా ఉండడం వల్ల పొంగు ఆగకుండా వస్తూనే ఉంటుంది. అంటే.. పైన కనపడే పొంగునే మనం చూస్తుంటాం. గిన్నె కింద ఉన్న మంటను పెద్దగా పట్టించుకోం. మన ఆరోగ్యం విషయంలోనూ అదే జరుగుతోంది.
సాధారణంగా కడుపులో నొప్పిగా ఉంటే ఒక టాబ్లెట్ వేసుకుంటాం. తగ్గకపోతే మరొక టాబ్లెట్(Tablet). కానీ.. అసలు కడుపునొప్పి ఎందుకు వచ్చిందనే దానిపై దృష్టిపెట్టడం లేదు. ఒక న్యూట్రిషియన్(Nutrition)గా మేం చేసేది అదే. ఎవరైనా ఒక సింటమ్తో మా దగ్గరకు వస్తే.. ముందుగా దానికిగల కారణమేంటి? అనే దానిపైనే మా ఫోకస్ ఉంటుంది. ‘దేర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్ (మంట లేనిదే పొగ రాదంటారు)’ అంటారు కదా ! అలాగే ఏమీ లేకుండా ఊరికే బాడీ సిగ్నల్స్ లేదా సింటమ్స్ చూపించదు.
అందుకే మేం పేషెంట్ మెడికల్ హిస్టరీ(Patient Medical History)ని తెలుసుకుంటాం. పుట్టిన దగ్గర నుంచి (వ్జునల్ డెలివరీ నా లేదా సి-సెక్షన్ నా) టిల్ డేట్ మీకు ఉన్న ఎయిల్‌మెంట్స్ లేదా ఇష్యూస్ ఏంటి, ప్రెసెంట్ కన్సరన్స్ ఏంటి.. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు పేషెంట్ ప్రతీ చర్యను తెలుసుకున్నాకే ట్రీట్మెంట్ మొదలు పెడతాం.. అని న్యూట్రిషనిస్ట్ సాలికా బేగం పేర్కొన్నారు.
అందరికీ డైట్ అవసరమా?
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి డైట్ పాటించడం మంచిదే. అయితే, అందరికీ ఒకే రకమైన డైట్ ఉండదు. సాధారణంగా జనరిక్ డైట్స్‌లో వెయిట్ లాస్ అనగానే క్యాలరీ డెఫిసిట్ డైట్ ఇచ్చేస్తారు. మీకు ఉన్న లోపాలు ఏంటి, బరువు ఎక్కడి నుంచి తగ్గుతున్నారు అని పట్టించుకోరు. ఆ అప్రోచ్ వల్ల మీరు తగ్గినా మళ్లీ పెరిగిపోవచ్చు. కాబట్టి ఫస్ట్ బాడీ కాంపోజిషన్, దెన్ బ్లడ్ కాంపోజిషన్ చెక్ చేసుకొని డైట్ ఫ్రేమ్ చేసుకోవాలి. మన వెహికల్స్ ఎలా డ్రైవ్ చేయాలో తెలిసినప్పుడు, మన బాడీకి అందించే ఫుడ్ కూడా మనకు తెలియాలి. ఏదో కడుపు నిండింది అని కాకుండా.. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది చాలా ముఖ్యం.. అని సాలికా బేగం తెలిపారు.
ఫాస్టింగ్ చేస్తే ఫ్యాట్ కరగదు!
సాధారణంగా ఉపవాసం(ఫాస్టింగ్) చేస్తే కొవ్వు(ఫ్యాట్) తగ్గుందనుకుంటారు. ఇందులో భాగంగానే వన్‌పార్ట్ మీల్, టు పార్ట్ మీల్ లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు.
ఈవెనింగ్ 6 లేదా 7 లోపే తినాలని కొందరు రూల్ కూడా పెట్టుకుంటున్నారు. అయితే, చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే వంకతో పిజ్జాలు, బర్గర్లు, ఏది పడితే అది తినేస్తుంటారు. తర్వాత ఫాస్టింగ్ చేస్తాం కదా, ఫ్యాట్ కరుగుతుందిలే అనుకుంటారు. కానీ బాడీ అంటే కేవలం మజిల్, ఫ్యాట్ ఒక్కటే కాదు. ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి. మీరు న్యూట్రియంట్స్‌ని లూజ్ అవుతున్నారు. అలాగే ఇది అందరికీ సూట్ కాకపోవచ్చు.
డయాబెటిక్ పేషెంట్లు ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ తట్టుకోలేకపోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్‌కి, PCO/PCOS ఉన్న ఉమెన్‌కి సూట్ కాకపోవచ్చు. ఒకవేళ ఫాస్టింగ్ వల్ల మీరు వెయిట్ లాస్ అయినా, పోషకాలు లోపిస్తే జుట్టు ఊడిపోవడం, స్కిన్ పీకిపోవడం, ఎనర్జీ లేకపోవడం వంటి ప్రాబ్లెమ్స్ వస్తాయి. వెయిట్ లాస్ అయ్యే ముందు బాడీ కాంపోజిషన్ (మజిల్ ఉందా, ఫ్యాట్ ఉందా, వాటర్ ఉందా) చెక్ చేసుకోవాలి.. అని ప్రముఖ న్యూటిషనిస్ట్ సాలికా బేగం వివరించారు.
నంబర్స్ తగ్గడం వెయిట్ లాస్ కాదు!
చాలామంది నంబర్స్ తగ్గితేనే వెయిట్ లాస్ అనుకుంటారు. ఒక వ్యక్తి బరువు 80 కిలోలు అనుకుంటే అందులో మజిల్ పర్సంటేజ్ , ఫ్యాట్ ఎంతో చూడాలి. చాలామంది వేయింగ్ స్కేల్ మీద 5 కిలోలే తగ్గుతారు, కానీ టూ సైజెస్ లూజ్ అయినట్లు (ఇంచ్ లాస్) అనిపిస్తారు. ప్రాపర్ వెయిట్ లాస్లో మీ ఎనర్జీ డిప్ అవ్వదు, గ్లూకోజ్ మెటబాలిజం బెటర్ అవుతుంది. ఫేస్‌లో అలసట ఉండదు, తాజాగా కనిపిస్తారు. పద్ధతి ప్రకారం చేయకుండా ఏదో నంబర్ తగ్గాలని చేస్తే ముఖం పీకిపోతుంది, కడుపు కోతలు, కాంప్లికేషన్స్ వస్తాయి.. అని సాలికా బేగం పేర్కొన్నారు.
లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా డైట్ ముఖ్యం!
కొందరు లావుగా ఉంటారు. మరికొందరు సన్నగా ఉంటారు. లావుగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నామనుకోవద్దు. బకెట్ నిండి ఓవర్ ఫ్లో అయితేనే సింటమ్స్ బయటపడతాయి. బాడీలో సెల్ డిస్ ఫంక్షన్ మొదలై సింటమ్ బయటపడటానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి లోపల మెటబాలిజం, ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మార్కర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అలాగే సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ఉండి సన్నగా ఉన్నవాళ్లలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్, హై కార్టిసాల్ (స్ట్రెస్) లెవెల్స్ ఉండటం కొందరిలో గమనించాను. ఫిట్ బాడీ అనేది హెల్త్ కి సంపూర్ణ నిర్ధారణ కాదు. లోపల బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోవడమే ముఖ్యం.. అని సాలికా బేగం తెలిపారు.
టీ, కాఫీలో షుగర్ మంచిదేనా?
ప్రజలు టీ లేదా కాఫీలో వేసుకునే ఒక చెంచా షుగర్‌నే చూస్తున్నారు. కానీ, ప్లేట్ నిండా తింటున్న అన్నం గురించి ఆలోచించడం లేదు. అన్నం బాడీలోకి వెళ్లాక గ్లూకోజ్గానే మారుతుంది. మనం తినే ప్లేట్ మీల్స్ సమపాళ్లలో లేకుంటే టీలో వేసుకునే ఒక స్పూన్ షుగర్ కంటే ఎక్కువ డ్యామేజ్ కలుగుతుంది. అయితే, మన శరీరానికి షుగర్ సస్టెయిన్ కాకపోతే కాలక్రమేనా తగ్గించుకోవడం మంచిది.. అని న్యూటిషియన్ సాలిక బేగం తెలిపారు.
టీ లేదా కాఫీ మంచిదే, కానీ..!
చాలామందికి ఉదయాన్నే టీ తాగడం అలవాటు. కొందరు రోజులో మూడు, నాలుగుసార్లు కూడా తాగుతుంటారు. అయితే, టీ లేదా కాఫీలో ఉండే కెఫీన్ శరీరానికి పాయిజన్ ఏమీ కాదు. కొంచెం లిమిటెడ్ (రోజుకు 400 మి.గ్రా లేదా 2 కప్పులు) తీసుకోవడం మంచిది. నిద్ర లేచాక రెండు గంటల లోపు టీ, కాఫీ తాగడం మంచిది కాదు. ఎందుకంటే రాత్రి ప్రొడ్యూస్ అయిన మెలటోనిన్ లెవెల్స్ తగ్గాలి. లేవగానే కాఫీ తాగితే గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ వస్తాయి.
అంతేకాదు, కెఫీన్ అనేది ఒక యాంటీ-న్యూట్రియంట్. ఫుడ్ తింటున్నప్పుడు దాంతో పాటు టీ/కాఫీ తాగితే, మీరు తిన్న ఆహారంలోని ఐరన్, ఇతర పోషకాలను బాడీ అబ్జార్బ్ చేసుకోనివ్వదు. అందుకే ఆహారానికి, టీ/కాఫీకి మధ్య టైమ్ గ్యాప్ ఉండాలి. టీ/కాఫీ తాగాక 1 గంట వరకు, లేదా తిన్న తర్వాత 2 గంటల వరకు టీ/కాఫీ తీసుకోకూడదు.. అని సాలికా బేగం వివరించారు.
మిల్లెట్స్, చపాతీలతో పెద్దగా జరిగేదేమీ లేదు!
ప్రస్తుత రోజుల్లో మిల్లెట్స్ బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. అంతేకాదు, వెయిట్ లాస్ అనగానే రైస్ మానేసి చపాతీలు తింటుంటారు. కానీ, ఇక్కడ రైస్‌ను విలన్ చేస్తున్నారు. రైస్ ఎంత తినాలో అంతే తీసుకోవడం మంచిది. అంతేగానీ రైస్ మానేసి చపాతీ తినడం అత్యవసరమేమీ కాదు. పోర్షన్ కంట్రోల్ ఉంటే రైస్ అయినా, చపాతీ అయినా ఒకటే. పూర్వంలో మూడుపూటలు రైస్ తిన్నా ఆరోగ్యంగానే ఉన్నారు కదా! అనే అనుమానం రావచ్చు. అయితే, అప్పట్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది.
రోకలితో దంచడం, నడవడం చేసేవాళ్లు. వాళ్లు తిన్న కార్బోహైడ్రేట్స్‌ని కరిగించేవాళ్లు. ఇప్పుడు మనం కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాయి. యాక్టివిటీ తగ్గింది. దీంతో తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి వెయిట్ పెరుగుతుంటారు. ఇక పాలు, పెరుగు శరీరాన్ని హెవీ చేస్తాయంటారు. అయితే పెరుగు ఒక ప్రోబయోటిక్. అందులో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది. పచ్చి పెరుగు తింటే కొందరి బాడీ దాన్ని ఫారిన్ పార్టికల్గా చూసి వామిటింగ్స్ లేదా లూజ్ మోషన్స్ తెప్పిస్తుంది.
కానీ అదే పెరుగుని చికెన్ కుర్మా లేదా ఆలూ కుర్మాలో వేసి వండినప్పుడు, వేడి తగిలి ఆ లైవ్ బ్యాక్టీరియా చనిపోతుంది. అప్పుడు బాడీకి సెట్ అవుతుంది. పడితే తినండి, పడకపోతే మానేయండి. ఇంకా రెండు రోజులు ఫాస్టింగ్ ఉన్నా, ఎక్స్సజ్ చేయకపోయినా ఏమీ కాదు. కానీ రెండు రోజులు నిద్రపోకపోతే మరుసటి రోజు డ్రౌజీగా అయిపోతారు. రాత్రి నిద్రలోనే బాడీ రిపేర్ అండ్ రెజువనేషన్ జరుగుతుంది. నిద్ర లేకపోతే కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుంది.
కార్టిసాల్ పెరిగితే బాడీ స్ట్రెస్ లో ఉండి, ఫ్యాట్ ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. క్రేవింగ్స్ ఎక్కువై ఎక్కువ తింటారు. బాడీ ఎప్పుడైతే సేఫ్ గా ఫీల్ అవుతుందో అప్పుడే ప్రాపర్ వెయిట్ లాస్ జరుగుతుంది. ఇక ఫంక్షనల్ డైట్ అనేది మీ ప్రాంతీయ ఆహార అలవాట్లకు (రీజనల్ డైట్) తగ్గట్టుగానే ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న కరెక్షన్స్ తో మొదలవుతుంది. మీ బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ (లోపాలు) తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే సప్లిమెంట్స్ అవసరమవుతాయి.
చివరిగా హెల్త్ ఈజ్ ఏ ఛాయిస్. రోజువారీ అలవాట్లే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. ఏదైనా సరే కన్సిస్టెంట్గా మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. రోగం వచ్చాక రిపేర్ చేసుకోవడం కంటే, రాకముందే జాగ్రత్త పడటం (ప్రివెన్షన్) ఎల్లప్పుడూ మంచిది, చౌకైనది అని.. ప్రముఖ న్యూట్రిషియన్ సాలికా బేగం వివరించారు. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం!!
అంతా లివరే చూసుకుంటుంది..!
మన బాడీని డీటాక్సీఫై చేయడానికి లివర్, కిడ్నీలు, లంగ్స్, స్కిన్, గట్ ఉన్నాయి. ఇంకా మన శరీరానికి డీటాక్స్ వాటర్, ప్రొటీన్ పౌడర్స్ పెద్దగా అవసరం లేదు. అవన్నీ మార్కెటింగ్ జిమ్మిక్కులే. విడిగా లెమన్ వాటర్ లేదా డీటాక్స్ వాటర్ శరీరంలోకి ఏం డీటాక్స్ చేయదు. అన్ని లివరే చేస్తుంది. కేవలం ఆ ఆర్గాన్ ఫంక్షనింగ్ ప్రాపర్‌గా ఉంచుకుంటే చాలు. ఇక నాన్-వెజిటేరియన్లకు ఫుడ్ నుంచే ప్రొటీన్ దొరుకుతుంది. ప్రత్యేకించి మార్కెట్లో లభించే డబ్బాలు అవసరం లేదు. వాటి గురించి సరైన ప్రొటీన్ తీసుకోనప్పుడు మాత్రమే ఆలోచించాలి.. అని న్యూట్రిషియన్ సాలికా బేగం సూచించారు.
ప్రముఖ డైటీషియన్ సాలికా బేగం