కీళ్ల ఆరోగ్యంపై అవగాహన
మెడికవర్ వైద్యుల సదస్సు
హైదరాబాద్, అక్టోబరు 11 (విజయక్రాంతి): ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం(World Arthritis Day) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ మణిదీప్ రెడ్డి, డాక్టర్ దీపక్ ప్రజలకు కీళ్ల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కీళ్ల నొప్పులు, వాపు, బిగుతుదనం, కదలికల్లో ఇబ్బందులను నిర్లక్ష్యం చేయకుండా ప్రారం భ దశలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువును నియంత్రణలో ఉం చుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు తెలిపారు. సోమవారం మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఎక్స్రే స్క్రీనింగ్ అందిస్తున్నట్లు డాక్టర్ మణిదీప్ రెడ్డి, డాక్టర్ దీపక్ తెలిపారు.