స్ట్రెచ్ మార్క్స్‌కు బంగాళదుంప చిట్కా!

03-11-2026 | 01:24pm

చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ (Stretch Marks) ఒకటి. ముఖ్యంగా నడుము, పొట్ట భాగాల్లో ఏర్పడే ఈ గీతల కారణంగా కొందరు ఆందోళన చెందుతుంటారు. వీటిని తగ్గించుకునేందుకు బంగాళదుంపతో ఓ ఇంటి చిట్కా (Home Remedy) ప్రయత్నించవచ్చని చెబుతున్నారు.

ముందుగా ఓ బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడగాలి. అనంతరం మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ నుంచి వచ్చే రసాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే మీకు ఇబ్బందిపెట్టే స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గుతాయి.



మరిన్ని వార్తలు