విజయవాడ–చెన్నై మార్గంలో రైళ్లకు బ్రేక్
మహబూబాబాద్, నవంబర్ 3 (విజయ క్రాంతి): ఆంధ్రప్రదేశ్లో ఓవర్హెడ్ ఎలక్ట్రికల్ (OHE) సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో విజయవాడ, చెన్నై, తిరుపతి రైల్వే సెక్షన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎగువ, దిగువ మార్గాల్లో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెల్లూరు, కావలి, బిట్రగుంట తదితర స్టేషన్లలో చెన్నై, తిరుపతి, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా (Power Supply) పునరుద్ధరణ కోసం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తలెత్తిన సాంకేతిక లోపం (Technical Glitch) కారణంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నై వెళ్లే రైళ్లను తెలంగాణలోని పలు స్టేషన్లలోనూ నిలిపివేశారు. దీంతో పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.