అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ నోట్ల కలకలం!
హైదరాబాద్: హైదరాబాద్ శివారులో నకిలీ కరెన్సీ(Fake Currency) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapurmet) పరిసరాల్లో నకిలీ నోట్ల రవాణాకు సంబంధించిన వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టి రూ.6.7 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఇంత భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నోట్లను ఎక్కడ తయారు చేశారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసుల విచారిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.