ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
యాదగిరిగుట్ట,సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): దేశ స్వాతంత్రం, దేశ ప్రజల విముక్తి కోసం భగత్ సింగ్(Bhagat Singh) వీరోచిత పోరాటం చేశారని ఆయన త్యాగం, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు యువకులు సమస్యలపై పోరాటం చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం(All India Agricultural Workers Union) ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు. సోమవారం కాచారం గ్రామంలో మెజాడి కుమార్ తో పాటు యువ కులు, విద్యార్థులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే ఉరి కంభం ఎక్కిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ ఆశయాలకు విద్యార్థులు యువకులు కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.