మందనపల్లిలో కామ్రేడ్ డొంకెన నాగమణికి ఘన నివాళి

22-11-2026 | 07:43pm

ఎర్రజెండాల రెపరెపల మధ్య అంతిమయాత్ర..

ఆలేరు, నవంబర్ 22 (విజయక్రాంతి): మందనపల్లి అనారోగ్యంతో నవంబర్ 21న మృతి చెందిన కామ్రేడ్ డొంకెన నాగమణికి(Comrade Donkena Nagamani) సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు(Leaders of CPI(ML) New Democracy), గ్రామ ప్రజలు, బంధుమిత్రులు ఘనంగా నివాళులర్పించారు. ఎర్రజెండాలు, బ్యానర్లు, పుష్పగుచ్ఛాలతో అంతిమయాత్ర నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్ మాట్లాడుతూ.. 1995లో మందనపల్లి ప్రత్యేక గ్రామపంచాయతీగా(Village Panchayat) ఏర్పడిన అనంతరం జరిగిన ఎన్నికల్లో నాగమణి అత్యధిక మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారని, ఎనిమిది వార్డుల్లో ఐదు వార్డులతో పాటు ఉపసర్పంచ్ స్థానాన్ని న్యూడెమోక్రసీ గెలుచుకుందని గుర్తుచేశారు. పార్టీ, ప్రజా ఉద్యమాలకు నాగమణి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. జిల్లా సీనియర్ నాయకుడు మామిడాల సోమయ్య మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో, నిర్బంధ పరిస్థితుల్లో రహస్యంగా ఉన్న కామ్రేడ్స్‌కు నాగమణి అందించిన సహకారం వెలకట్టలేనిదన్నారు.

ఈ కార్యక్రమంలో ఇక్కిరి సహదేవ్, ఆర్. సీత, కల్లెపు అడివయ్య, బెజాడి కుమార్, కడకంచి కిష్టయ్య, పద్మ సుదర్శన్, గడ్డం నాగరాజు, నేరేడు స్వామి, బండి జంగమ్మ, ఆర్. ఉదయ్, మామిడాల బాలమల్లేష్, మారుజోడు సిద్దేశ్వర్, పద్మ శశిరేఖ, ఇక్కిరి శ్రీనివాస్, తమ్మడి మాధవి, సర్పంచ్ సిరిమతి రేణుక నరసయ్య, ఇరగదిండ్ల రాములు, వెంకటేష్, కర్రె స్వామి, కుర్రి మార్కండేయ, కడకంచి సత్తయ్య, బీరయ్య, రమేష్, దార యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు