కార్తీక మాసం యాదాద్రికి పోటెత్తిన భక్తులు

22-11-2026 | 07:37pm

కొండ కింద రింగురోడ్డులో ఎటు చూసినా వాహనాలే

ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటలు

వి వి ఐ పి దర్శనాలు రద్దు

1901 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి

యాదగిరిగుట్ట, నవంబర్  22  (విజయ క్రాంతి): కార్తీక మాసం ఆదివారం సెలవు కావడంతో  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు(devotees) తరలి వచ్చారు. వేకువ జాము నుండి రాత్రి వరకు భక్తులతో(devotees) యాదగిరి క్షేత్రం క్రిక్కిరిసిపోయింది . శనివారం సాయంత్రం నుండే వాహనాల రద్దీ తో యాదగిరిగుట్ట లో రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగింది. కొండపైన తిరువీధులలో భక్తుల(devotees) సందడి నెలకొంది.

దర్శనం క్యూలైన్లలో ప్రసాద విక్రయశాలలో భక్తులు(devotees) బారులు తీరారు. ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృశ్య వి, విఐపి ల దర్శనాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు. కొండ కింద రింగురోడ్డు వాహనాలతో క్రిక్కిరిసిపోయింది. కొండపైన వాహనాలు రద్దీ పెరగడంతో కొండపైకి వాహనాలను అనుమతించలేదు. భక్తుల రద్దీ దృశ్య దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్వామి వారి దివ్య క్షేత్రంలో   నిత్య  పూజా కైంకర్యాలు   శాస్త్రోక్తంగా  నిర్వహించారు. కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతాలలో 1901 సత్యనారాయణ స్వామి కథలు జరిగాయని, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ అధికారులు తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం భక్తులు కొండపైన స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర  శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవాలను నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు