కాంగ్రెస్, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి

12-10-2026 | 09:55pm

గుండాల,(విజయక్రాంతి): సిపిఐ, ఏఐఎస్ఎఫ్(CPI, AISF) నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్స్, మందుల కొరత గురించి వైద్యశాల ఎదుట నిరవధిక దీక్ష చేపట్టిన విషయం విధితమే. వారు తలపెట్టిన దీక్షను దానికి సంబంధించిన కారణాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఖదీర్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల(MLA Payam Venkateswarlu) దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సిపిఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్ తో ఛరవాణీలో మాట్లాడి వారి డిమాండ్స్ ని వారం రోజుల్లో తీరుస్తానని, మండల ప్రజల ఆరోగ్యం, యోగ క్షేమమే తనకు ముఖ్యమని తెలిపారు.

సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊకే బుచ్చయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) జిల్లా కార్యదర్శి ఖదీర్ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లను మణుగూరు క్యాంపు కార్యాలయంలో కలిసి మండల వైద్యాశాలకు సంబంధించిన అన్ని సమస్యల గురించి వ్రాతపూర్వకంగా అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పాయం వారి సమక్షంలో డీఎం అండ్ హెచ్ఓ, కలెక్టర్ తో ఛరవాణీలో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారని ఖదీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, సిపిఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, పడుగోనిగూడెం సర్పంచ్ ఈసం సంజీవ రావు, మండల నాయకులు ఈసం రాజబాబు, జోగ రమేష్, బొంగు చంద్రశేఖర్, బానోత్ నరేందర్, సిపిఐ నాయకులు గడ్డం శ్రీను, సమయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు