పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ

19-10-2026 | 05:55pm

వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం,(విజయక్రాంతి): దుర్గామాత నవరాత్రులలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌(Police Headquarters)లో ఆయుధ పూజ, వాహన పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పోలీస్ అధికారుల కు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుధ పూజ(Ayudha Puja) కార్యక్రమంలో భాగంగా , ఆయుధాలను ప్రత్యేకంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

ఆయుధ పూజ మన సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని, అనంతరం పోలీస్ వాహనాలకు వాహన పూజ నిర్వహించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందికి అన్న ప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు