ప్రజావాణికి 48 ఫిర్యాదులు

19-10-2026 | 05:43pm

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

బోధన్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి(Prajavani program) వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు రాజాగౌడ్(Additional Collector Rajagoud), భుజంగరావు అధికారులను ఆదేశించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మొత్తం 48 ఫిర్యాదులు అందాయి.

అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావుతో పాటు ట్రైనీ కలెక్టర్ సురేశ్ ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తున్నందున, అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు