వాగులో తెగిపడ్డ విద్యుత్ తీగ. సకాలంలో స్పందించిన సిబ్బంది

04-11-2026 | 03:08pm

బోథ్. నవంబర్ 4 (విజయ క్రాంతి): మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి వెళ్లే 11 కెవి విద్యుత్తు లైను (11 kV power line)తెగి వాగులో పడిపోయింది. దీంతో ఉదయం(Morning) పూటదాదాపు పదిన్నర గంటల  సమయం నుండి ఆ రూట్లో విద్యుత్ సరఫరా(Electricity supply) నిలిచిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న లైన్మెన్ గోపి సకాలంలో స్పందించి మరమ్మతులు చేపట్టారు.

విద్యుత్తు లైన్ పైకి ఉడుత ఎక్కడంతో స్పార్కింగ్ జరిగి విద్యుత్ తీగ తెగి వాగులో పడిపోయింది. వాగు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండడంతో చెట్లను తొలగించి విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి విద్యుత్ తీగను బిగించి విద్యుత్సరఫరా అయ్యేలా చూశారు. లైన్మెన్ కృషిని పలువురు రైతులు గ్రామాల ప్రజలు అభినందించారు.

మరిన్ని వార్తలు