ఉచిత స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ.
కోదాడ నవంబర్ 04(విజయ క్రాంతి): ఉచిత స్టడీ మెటీరియల్( free study material) సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar), జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న కేఆర్ఆర్ కళాశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడుతున్న కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ శిక్షణ కేంద్రం ద్వారా 400 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి , సిఐలు కోదాడ పట్టణ సిఐ శివశంకర్, కోదాడ రూరల్ సీఐ, రామకృష్ణారెడ్డి, హుజూర్నగర్ సిఐ, చరమంద రాజు, ఎమ్మార్వో సంతోష్ కిరణ్. ,మున్సిపల్ కమిషనర్ రమాదేవి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.