యాసంగి పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
చందుర్తి, నవంబర్ 05, (విజయక్రాంతి): మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామం లో(Ashireddipalli Village) ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అధిక నీటి అవసరమున్న పంటల సాగుపై పునరాలోచించాలని, పరిస్థితులకు అనుగుణంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, స్వల్పకాలిక పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో క్రాప్ హాలిడే అంశాన్ని పరిశీలించాలని, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని రైతులకు తెలిపారు. వరి లో పంట అవశేషాలని కాల్చవద్దని, వాటిని భూమిలోనే కలియదున్నడం ద్వారా సేంద్రియ కార్బనం పెరుగుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పంట సాగు చేసి లాభాలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొజ్జ మల్లేశం, మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, ఎంపీడీఓ రాధ, పాక్స్ డైరెక్టర్ మహేందర్, ఉప సర్పంచ్ మహేందర్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, కార్యదర్శి మహేష్,విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.