ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలి

05-11-2026 | 05:12pm

తాంసి/భీంపూర్,నవంబర్ 5 (విజయక్రాంతి):భీంపూర్ మండలాన్ని(Bheempur mandal) రాష్ట్ర ప్రభుత్వం(State Government) కరువు మండలంగా ప్రకటించడంతో గురువారం సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు ప్రభాకర్ రెడ్డి వారి బృందంతో కలిసి వ్యవసాయ పొలాలను(Agricultural fields) సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వర్షాలు లేక పత్తి పంట దెబ్బతిందని,రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లని పరిస్థితి ఏర్పడిందని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఎకరనికి కనీసం లక్ష రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రైతులతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు..ఆయన వెంట సీపీఐ జిల్లా నాయకులు రాములు,రమేష్,షేక్ పాషా,గణేష్,షేక్ సలీం,గంగాధర్, విఠల్,తదితులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు