రిమ్స్‌ను వెంటాడుతున్న వరస ఘటనలు

04-11-2026 | 12:43pm

ఆసుపత్రి నుండి నాలుగు వెంటిలేటర్ల చోరీ

బట్టబయలైన భద్రతా నిర్లక్ష్యం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్(Adilabad RIMS Hospital)లో  రోజుకో నిర్లక్ష్యపు ఘటన వెలుగుచూస్తోంది. అగ్ని ప్రమాదంలో నవజాత శిశువుల మరణం, ఓ గర్భిణి మృ తి, వైద్యుడి తీరుతో ఓ యువకుడి ఆత్మహత్య. ఇలా వరుస ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలెటర్లను ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డులు, నిత్యం సిబ్బందితో కిటకిటలాడే ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రత నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ టూటౌన్(RIMS Director Jaisingh Rathod) లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుకు కేసు నమోదు చేశారు. సీఐ నాగరాజు ఆ వార్డును సందర్శించి దర్యాప్తు చేపట్టారు. గతనెల 30న రిమ్స్ లోని రెండో అంతస్తులో ఉన్న ఆర్వసీ యూ విభాగంలో వెంటిలేటర్ల దొంగతనం సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పల్మనాలజీ విభాగంలోని ఆరఐసీయూ వార్డు, చెస్ట్, టీబీ వార్డుల్లో కలియ తిరిగారు.

ఆర్ఐసీయూ, చెస్ట్ విభాగంలో ఉన్న రెండు వెంటిలేటర్లు, దానికి ఎదురుగా ఉన్న టీబీ విభాగంలోని మరో రెండు వెంటిలేటర్లను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. అక్కడ స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ గార్డు, పేషెం టేకేర్ ఉన్నట్లు సమాచారం. పట్టపగలే ఘటన చోటుచేసుకోగా వారంతా ఏం చేశారనేది ప్రశ్నా ర్థకంగా మారింది. వెంటిలెటర్లు ఎత్తుకెళ్తూ సీసీ కెమెరాలో రికార్డయిన ఇద్దరు నిందితుల సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు. ఇద్దరు దొంగలు వెంటిలెటర్లను సంచిలో పెట్టుకొని దర్జాగా తీసుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మరిన్ని వార్తలు