ఏకగ్రీవంగా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా సొల్లు రాజశేఖర్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) డాన్సర్స్ యూనియన్(Dancers Union) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దుర్గం రమేష్, సానా సుధాకర్, కప్పల రాజేష్ ఆధ్వర్యంలో జరుగగా అధ్యక్షులుగా సొల్లు రాజశేఖర్ ను ఎన్నుకున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా జీవ, ఉపాధ్యక్షులు, కోశాధికారి తూర్పాటి నాని, ఉపాధ్యక్షులుగా రామిళ్ల రాకేష్, సహాయ కార్యదర్శిగా దూట తిరుపతి, ప్రెస్ సోషల్ మీడియా ఇంచార్జిగా రాపర్తి పవన్, యూనియన్ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ గా చాగల రాకేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ తరుపున అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు శ్రావణ్, మహేష్, కళ్యాణ్, బబ్లు కుశాల్ , అఖిల్, రంజిత్. అనిల్, రఘు, హరికృష్ణ, శ్రీకాంత్, సాయిచంద్, శివ, రాజు పాల్గొన్నారు.