ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సులు
ఉట్నూర్ మండల న్యాయ సేవా అధికార ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సులు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల(Utnoor Mandal) న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఇంద్రవెల్లి(Indravelli) మండల కేంద్రంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్స్ బి. జైవంత్ రావు కుడెల్లి అశోక్ లు పలు చట్టాలతో పాటు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఉచిత సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు ఉచిత న్యాయ సేవా సంచార వాహనం ద్వారా గ్రామాల్లో సంచరించి చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం న్యాయ సేవల కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎస్ఏ ప్యానల్ అడ్వకేట్స్ బి.జైవంత్ రావు, కుడెల్లి అశోక్ న్యాయవాదులు మానాల లక్ష్మినారాయణ అజాహర్ తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్స్ బి. జైవంత్ రావు కుడెల్లి అశోక్ లు పలు చట్టాలతో పాటు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఉచిత సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు ఉచిత న్యాయ సేవా సంచార వాహనం ద్వారా గ్రామాల్లో సంచరించి చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం న్యాయ సేవల కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎస్ఏ ప్యానల్ అడ్వకేట్స్ బి.జైవంత్ రావు, కుడెల్లి అశోక్ న్యాయవాదులు మానాల లక్ష్మినారాయణ, అజాహర్, తదితరులు పాల్గొన్నారు.