కాపాడాల్సిన చేతులే.. కాటేయబోయాయా?
29-09-2026 | 10:12am
హైదరాబాద్: మానవ సంబంధాలను ప్రశ్నించే ఘటన నగరంలోని అల్వాల్(Alwal)లో వెలుగుచూసింది. గోపాల్‌నగర్(Gopalnagar)లో నివాసముంటున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి సొంత కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుమార్తె కేకలు వేయడంతో అప్రమత్తమైన తల్లి.. భర్తను అడ్డుకున్నట్లు సమాచారం. అనంతరం పిల్లలతో కలిసి భర్తపై గొడ్డలితో దాడి చేయడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.