జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్‌కు ఘన సన్మానం

29-09-2026 | 07:17pm

రుద్రంగి సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(Republican Party of India) భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్, సినీ నిర్మాత మార్గం గోపి మహారాష్ట్ర నుండి రుద్రంగి మండలానికి వచ్చిన సందర్భంగా స్థానిక దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం మహేంద్ర గైక్వాడ్ మాట్లాడుతూ,దళితుల హక్కుల సాధనకు,వారి అభ్యున్నతికి ఆర్‌పీఐ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆయనను ఇంతగా ఆదరించి, గౌరవించిన రుద్రంగి మండల దళిత సంఘాల నాయకులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ముఖ్య నాయకులు దయ్యాల నారాయణ, గసికంటి రాజు, కట్కూరి దాసు, తర్రె లింగం,సింగారపు గంగరాజం, దయ్యాల పెద్దలు, సుంచు అనిల్ కుమార్, సింగారపు గంగిరెడ్డి, లింగంపెల్లి  సుదర్శన్, గొళ్ళెం నర్సింగ్, కుమార్, స్థానిక యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు