అక్టోబర్ 1న కేబినెట్ భేటీ.. అజెండాలో ఇవే!

29-09-2026 | 03:34pm

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana cabinet meeting) అక్టోబర్ 1న జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్-2027 నిర్వహణ, హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన అంశాలు, మూసీ రివర్ ప్రాజెక్ట్, ఆర్ఆర్ఆర్ నిర్మాణం వంటి అంశాలు కేబినెట్ అజెండాలో ఉండనున్నట్లు సమాచారం.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ, నిర్మాణానికి అయ్యే వ్యయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మూసీ రివర్ ప్రాజెక్ట్ ఫేజ్-1 పనులు పూర్తైన నేపథ్యంలో భూసేకరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:  కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

అదేవిధంగా రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం, నిధుల సమీకరణ, అవసరమైన అనుమతుల అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ చీరల పంపిణీ, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల చెల్లింపులపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్ 1న జరిగే మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు