మాజీ ఎంపీ సోయం కృషితో గుస్సాడి దండారి నిధుల మంజూరి
బోథ్,(విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసుల పండుగ అయిన బండారి ఉత్సవాలకు నిధులు మంజూరు చేయాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు(Former MP Soyam Bapurao) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించడంతో నిధులు మంజూరు కావడం జరిగిందని రాజగోపాల్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషం రావు పేర్కొన్నారు.
ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు దండారి ఉత్సవాలని గత ఏడాది దండారి నిధులు రాకపోవడంతో ఈసారి మాజీ ఎంపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పండుగ ప్రాముఖ్యతను విన్నవించారని అంతేగాక రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇన్చార్జి మంత్రిలకు కలిసి వివరించడం జరిగిందన్నారు. అంతేగాక గత రెండు వారాల క్రితం నుండి నిధుల మంజూరు కి మాజీ ఎంపీ కృషి చేస్తున్నారన్నారు.
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారితో సమావేశం కావలసి ఉన్న సమయం లేకపోవడంతో ఫోన్లో మాట్లాడి నిధులు మంజూరయ్యే విధంగా చూశారన్నారు అంతేగాక వేం నరేందర్ రెడ్డి తో మాజీ ఎంపీ ఫోన్లో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేశారన్నారు. నిధుల మంజూరు కి కృషి చేసిన మాజీ ఎంపీకి ఆదివాసి పల్లె ప్రజలు పర్సనల్ వ్యక్తం చేస్తున్నారన్నారు.