ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలి: ఆత్మ చైర్మన్

21-09-2026 | 01:06pm

బోథ్. సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని ఆత్మ చైర్మన్(ATMA Chairman) గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీఎస్సీ సెల్(Congress Party SC Cell) రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ని 14వ వార్డులో వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పండుగ వేడుకలను జరుపుకోవాలన్నారు.

నిమజ్జనం రోజున ప్రశాంతంగా నిమజ్జనం జరిగే విధంగా పాటుపడాలన్నారు. అంతేగాక వడ్డెర సంఘం గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గిరీష్ మాజీ ఎంపీటీసీ షేక్, నాకు రహీముద్దీన్, పోశెట్టి, సంతోష్, రాజు తో పాటు మైసమ్మ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు