అయా పోస్టులపై సతమతం...!
- విద్యార్హత లేదు అంటూ తిరస్కరణలు...?
- ధరఖాస్తు దారలకు నోటిసులు ఇచ్చిన ఆధికారులు...!
- అయా పోస్టులకు రాజకీయ నాయకులు పైరవీలు...!
- బాధితుల ఆవేదన పట్టించుకోని నాధుడే కరువయ్యారు
మణుగూరు, సెప్టెంబరు21,(విజయక్రాంతి): అంగనవాడి ఆయా పోస్టులకు పైరవీలు చేస్తూ కొంతమంది నాయకులు(Political leaders) అర్హులకు అన్యాయం చేస్తున్నారు. మణుగూరు ఐసిడిసి పరిధిలోని ఇటీవల ప్రభుత్వం అంగన్వాడీ ఆయా పోస్టులు విడుదల చేసింది. అంగనవాడి ఆయా పోస్టులకు(Anganwadi worker posts) పదవ తరగతి అర్హతను ఉండాలని దరఖాస్తులు పేర్కొన్నారు. కానీ ఎంతోమంది మహిళలు పదవ తరగతి విద్యా ప్రమాణంతో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు మరికొందరు ఇంటర్ డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేశారు. అంగన్వాడి ఆయ పోస్టులకు కేవలం పదవ తరగతి మాత్రమే అర్హత ఉండాలని సూచించినప్పటికీ, ఇంటర్ వాళ్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
ఆయా పోస్టులో ఇంటర్వ్యూలకు(Anganwadi worker Interview) కాల్ లెటర్లు ఇచ్చేందుకు కొంతమంది ఐ సి డి సి అధికారులు పదవ తరగతి అభ్యర్థులకు ఇంటర్ ఉంటేనే మీరు అర్హులు అంటూ, తిరస్కరణ లెటర్లను అందజేశారు. మణుగూరు ఐసిటిసి పరిధిలో ఓ మండలంలో అంగన్వాడి పోస్ట్ లపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు(Congress leaders) తమకు చెందిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలంటూ లేని పక్షంలో గందరగోళం సృష్టిస్తామంటూ హుఖం జారీ చేశారు. అంగన్వాడిఅధికారులు పదవ తరగతి అభ్యర్థులను మీరు అనర్హులంటూ, లెటర్ లను ఇవ్వడమే కాకుండా, పైరవీలకు కొమ్ముకాశారు. నేటి ఉద్యోగాల పరిస్థితి రాజకీయంగా అమ్ముడుపోతున్నాయని, అలాంటప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారు అంటూ పలువురు బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్(Collector) స్పందించి అర్హులకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.