భువనగిరిలో గరుడ వస్త్ర సిల్క్స్ గ్రాండ్ ఓపెనింగ్
సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఇనాగురేషన్
భువనగిరి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ సమీపంలోని మెయిన్‌రోడ్డు(Main Road)లో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ వస్త్ర సిల్క్స్–ఫ్యామిలీ షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ అవేష్, జాలిగాం విఘష్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జక్క శమంతకమణి, జక్క మనీషా, జక్క శ్రేయ, అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌లో చీరలు, సంప్రదాయ వస్త్రాలు, ఆధునిక దుస్తులతో పాటు వివిధ రకాల ఫ్యాషన్ కలెక్షన్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు కుటుంబ సమేతంగా షోరూమ్‌ను సందర్శించి సేవలను వినియోగించుకోవాలని చైర్మన్ జక్క రఘునందన్ రెడ్డి కోరారు.