ఇందిరా గాంధీకి ఎమ్మెల్యే నివాళి

19-11-2026 | 11:26am

ఉట్నూర్, నవంబర్ 19 (విజయక్రాంతి): దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi Birth Anniversary) జయంతి సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుటుంబ పెద్దలకు రూ.5 లక్షల జీవిత బీమా (Life Insurance) కల్పించే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు