ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
26-11-2026 | 05:25pm
బేల నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తోంది. బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తవడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తోంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మంచాల భూపతి రెడ్డి, సామ రూపేష్ రెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్‌తో కలిసి నూతన గృహాన్ని ప్రారంభించారు.