బాలల భద్రతపై అవగాహన ఉండాలి

31-10-2026 | 12:46am

బోథ్,(విజయక్రాంతి): బాలల భద్రతపై వారికి అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కుంభ సందీప్(Junior Civil Court Judge Kumbha Sandeep) పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పొచ్చెర గ్రామంలో సురక్షిత్ బచ్ ఫన్ అభియాన్ కార్యక్రమం(Surakshit Bachpan Abhiyan Event)లో భాగంగా బాలల భద్రతపై అవగాహన(Child Safety Awareness) సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఫోక్స్వ చట్టం సురక్షితమైన అసురక్షితమైన స్పర్శలు వ్యక్తిగత హద్దులు ఆన్లైన్ భద్రత పైన అవగాహన కలిగించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే నమ్మకమైన పెద్దలకు చెప్పాలని సహాయం చేసేంతవరకు చెబుతూనే ఉండాలన్నారు. పిల్లల భద్రత అందరి భద్రత విభావించి వారికి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏ జి పి పంద్రం శంకర్ ,న్యాయవాది కుమ్మరి విజయకుమార్, పిసి లైలా, అంబాజీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు