రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రారంభించిన బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చేంగిచెర్ల డివిజన్(Chengicherla Division) సూరజ్ నగర్ కాలనీలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు శుక్రవారం బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు, కాలనీలో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యంతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ డివిజన్ అధ్యక్షులు పొగుల నరసింహ రెడ్డి, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు బొమ్మక్ కల్యాణ్, మాజీ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ, కాలనీ అధ్యక్షులు రవిచందర్, పడతం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.