పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

31-10-2026 | 01:02am

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

కమాన్‌పూర్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) కమాన్‌పూర్ మండలం పేరపల్లి గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinubabu) శుక్రవారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చెన్నోజు శ్రీనివాస్ చారి, చెప్పాల దేవేందర్, గుర్రాల రాజమ్మ, పోలుదాసరి పోషాలు, పున్నం సమ్మయ్య, ఆకుల సుగుణ, ఎరుకల సత్యనారాయణ తదితరుల కుటుంబాలను పరామర్శించారు.

కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవడం, కష్టసమయంలో వారికి మనోధైర్యం కల్పించడం మానవీయ బాధ్యతగా భావిస్తూ శ్రీనుబాబు గ్రామంలో పలు కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు