సింగిల్ విండో చైర్మన్‌గా నియమితులైన అరవింద్ కుమార్ రెడ్డి

31-10-2026 | 12:26am

దేవరకద్ర: సింగిల్ విండో చైర్మన్‌(Single Window Chairman)గా నియమితులైన కొత్త అరవింద్ కుమార్ రెడ్డిని కౌకుంట్ల మండల పరిధిలోని రైతు వేదిక వద్ద దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (Devarkadra MLA G. Madhusudan Reddy) శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటూ రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని అరవింద్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు