ఆదివాసి సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలి

26-10-2026 | 09:36pm

తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): యువత ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని,చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరం భీమ్ బాటలో అందరూ నడవాలని భీంపూర్ మండల ఆదివాసి నాయకులు కోరారు. సోమవారం భీంపూర్ మండల కేంద్రంలో కొమురం  భీమ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివాసుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ... జల్, జంగల్, జమీన్ అంటూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరం భీమ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ నాయక్, డిటీ,హరిదాసు,ఆదివాసీ నాయకులు మాణిక్ రావ్, మాడావి లింబాజి,పురుషోత్తం, పాండురంగ్,దత్తు,సురేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు