ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్
26-10-2026 | 10:30pm
బోధన్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య(Police Commissioner P. Sai Chaitanya) ఐపీఎస్ ప్రజల నుంచి 39 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విన్న ఆయన, వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలకు సూచించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.