రైతు కళ్ళ ఎదుటే జొన్న పంట దగ్దం
భీంపూర్, నవంబర్ 18 (విజయక్రాంతి): భీంపూర్ మండలం(Bhimpur Mandal) పిప్పల్ కోటి గ్రామ శివారులో జరిగిన అగ్ని ప్రమాదంలో(Fire hazard) మొక్క జొన్న పంట దగ్దం(Corn and sorghum crop burning) అయింది. రైతు షేక్ జావిద్ 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు(Corn cultivation) చేశారు. మరికొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే క్రమంలో బుధవారం ప్రమాదవశాత్తు పంట చేనులో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు రైతుకు సమాచారం ఇచ్చిన, రాత్రి వేళలో చీకటి కారణంగా పంట పూర్తిగా రైతు కళ్ళ ఎదుటే దగ్దం అయింది. చుట్టుపక్కల రైతులు వచ్చి మంటలు ఆర్పేయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. పంట పెట్టుబడి కోసం రూ.10 లక్షలు ఖర్చు అయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.