బెజ్జూర్ కు హైదరాబాద్ బస్సు ప్రారంభం
బెజ్జూర్ నవంబర్ 18 విజయక్రాంతి : బెజ్జూర్ మండల(Bezjur Mandal) కేంద్రానికి హైదరాబాద్ బస్సు(Hyderabad Bus) రావడంతో మండల నాయకులు ప్రజలు బస్సుకు పూలమాలలు వేసి, డ్రైవర్ కండక్టర్ ను సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(Sirpur MLA Dr. Palvai Harish Babu) ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్ ఈరోజు సూపర్ లేగ్జర్ బస్సు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బస్సు ఆసిఫాబాద్ కాగజ్నగర్ సిర్పూర్ కౌటాల చింతలమానపల్లి మీదుగా బెజ్జూర్ కు వస్తుందని తెలిపారు. ప్రతిరోజు రాత్రి ఈ బస్సు 7 గంటల వరకు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.