తొలగించిన చందనం 99 కిలోల 720 గ్రాములు

18-11-2026 | 10:28pm

జగిత్యాల, నవంబర్ 18 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లా(Jagtial District) కొండగట్టు ఆంజన్న ఆలయంలో(Kondagattu Anjanna Temple) స్వామివారి చందనోత్సవ ఉత్సవాలలో(Moon Festival celebrations) భాగంగా ఈరోజు స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించారు. ఈ సందర్బంగా తొలగించిన చందనాన్ని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు(Regional Joint Commissioner Ramakrishna Rao) ఆధ్వర్యంలో తూకం వేయగా 99 కిలోల 720 గ్రాములు రాగా, అట్టి చందమును పంచనామా నిర్వహించి, తగిన భద్రతా చర్యలతో సీల్ వేసి భద్రపరచారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి, ప్రధానార్చకులు, జితేంద్ర ప్రసాద్, చిరంజీవ స్వామి, మారుతీ ప్రసాద్, స్థానాచార్యులు కపిందర్, సహాయ కార్యనిర్వహణాధికారి, హరిహరనాథ్, పర్యవేక్షకులు సునీల్ కుమార్, పరిశీలకులు అశోక్, లక్ష్మా రెడ్డి, ఏ ఎస్ ఐ రామయ్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు