అర్హులందరికీ సంక్షేమ పథకాలే ప్రభుత్వ ధ్యేయం

18-11-2026 | 10:35pm

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, నవంబర్ 18 (విజయ క్రాంతి): సమాజంలోని పేదలు, నిరుపేదలు, బలహీన వర్గాల( poor, needy, vulnerable) జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారికి ఆర్థిక భరోసా(Financial security) కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు(K.R. Nagaraju) అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల(Government welfare schemes) ఫలాలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి()Revanth Reddy నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ(Hanumakonda) లోని అంబేద్కర్ భవన్‌ లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గ లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి , వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న లతో కలిసి లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందని కొనియాడారు. సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు అనే లక్ష్యంతో ప్రభుత్వం చేయూత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థిక చేయూత అందించడం అభినందనీయమన్నారు. పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, అర్హులైన లబ్ధిదారులకు ఆత్మగౌరవంతో జీవించేందుకు భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.

గ్రేటర్ వరంగల్ పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,161 మంది లబ్ధిదారులకు నూతనంగా చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 1,426 మంది వితంతువులు, 478 మంది దివ్యాంగులు, 139 మంది కల్లుగీత కార్మికులు, 5 మంది చేనేత కార్మికులు, 20 మంది అవివాహిత ఒంటరి మహిళలు, 93 మంది వివాహిత ఒంటరి మహిళలు ఉన్నారు.కుడా చైర్‌పర్సన్  గుండు సుధారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు పింఛన్లు అందించడం అభినందనీయమని, ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బల్దియా ఇన్‌చార్జి అదనపు కమిషనర్ సమ్మయ్య, హనుమకొండ జిల్లా డీఆర్‌డీఏ మేన శ్రీను, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు