కుటుంబాలకు ఆర్థిక భద్రత.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం(Indiramma Family Insurance Scheme) అమలుపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసేందుకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జజు(General Secretary Sanjay Jaju) బుధవారం జిల్లా కలెక్టర్ల(District Collectors)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. పథకానికి అర్హులైన కుటుంబాల్లోని సభ్యులందరి వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులెవరూ నమోదు ప్రక్రియకు దూరం కాకుండా చూడాలన్నారు.
ప్రస్తుతం వివిధ విభాగాల ద్వారా అమలవుతున్న వ్యక్తిగత బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంపై దృష్టి సారించాలని సంజయ్ జజు సూచించారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం లక్ష్యాలను ప్రజలకు వివరించేలా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
నమోదు ప్రక్రియ నుంచి పథకం అమలు వరకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కుటుంబ భద్రత కల్పించే ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.