స్పా సెంటర్ పై దాడి

18-11-2026 | 10:05pm
  1. పరారీలో నిర్వాహకురాలు 
  2. కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు 

ఎల్బీనగర్, నవంబర్ 18 : అనుమతులు లేకుండా అక్రమంగా రెసిడెన్షియల్ జోన్(Residential zone) లో నిర్వహిస్తున్న స్పా సెంటర్(Spa center) పై బుధవారం సాయంత్రం వనస్థలిపురం ఎస్సై గిరిష్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే... హస్తినాపురం డివిజన్(Hastinapuram Division) నాగార్జున కాలనీలో కెనరా బ్యాంక్ పక్కన ఉన్న వీధిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎటువంటి చెల్లుబాటు అయ్యే అనుమతి లేకుండా అక్రమంగా మసాజ్ సెంటర్(Massage center) నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు 'కైమ్ స్పా' (Kym Spa) పేరుతో నిర్వహిస్తున్న సెంటర్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేకపోవడంతోపాటు కస్టమర్ల వివరాలు సేకరించకపోవడం, థెరపిస్ట్ సర్టిఫికెట్లు లేకపోవడం, స్పా లోపలి గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని గుర్తించారు.

ఈ సందర్భంగా 'కైమ్ స్పా'  ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నెంగ్హోయికిమ్ టౌతాంగ్, వుంగ్జౌవి వైఫీ, నెంగ్‌న్గైమోమ్ హాకిప్ స్పా థెరపిస్టుగా పని చేస్తున్నారు. వీరితోపాటు కస్టమర్లు మహ్మద్ సాది, లక్ష్మీ నితిన్ ఉన్నారు.  స్పా యజమాని లామ్నీచోంగ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్పా యజమాని లామ్నీచోంగ్ తన ఆర్థిక ఇబ్బందుల కారణంగా తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలని పథకం ప్రకారం10 నెలలుగా  'కైమ్ స్పా'ను ప్రారంభించి, అవసరమైన కస్టమర్ల నుండి ఎక్కువ డబ్బు వసూలు చేస్తూ మహిళలతో పురుషులకు మసాజ్ చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిష్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు