రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

10-10-2026 | 05:28pm

బాధిత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం

తలమడుగు అక్టోబర్ 10(విజయక్రాంతి): తలమడుగు మండల(Talamadugu Mandal) కేంద్రానికి చెందిన రైతులు కాడే లాస్మన్న, గుర్రాల ప్రతాప్ మృతి నేపథ్యంలో శనివారం  ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Adilabad MLA Payal Shankar), బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీ నర్సయ్యతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంట నష్టాలు(Crop losses), అప్పుల భారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, రైతు కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23 నుంచి ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో  బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, సర్పంచ్ చంటి , శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అనుజ్ఞా రెడ్డి, చంద్రశేఖర్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు  కట్కం రాందాస్,  రత్నాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్

మరిన్ని వార్తలు