ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

24-11-2026 | 05:29pm

బోథ్. నవంబర్ 23 (విజయ క్రాంతి) రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కుటుంబ బీమా పథకాన్ని(Telangana Family Insurance Scheme) ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి అల్పటి అచ్యుతానంద రెడ్డి కోరారు. ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబ యజమాని దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల్లో మరింత భరోసా తెలుపుతుందన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి వ్యక్తి బీమా చేయించుకోవాలన్నారు. ఈ విషయంలో అధికారులు ఇప్పటికే ప్రజలకు అవగాహన కలిగించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తూనే మరిన్ని పథకాల అమలు చేస్తున్నది అన్నారు.

మరిన్ని వార్తలు