ఏళ్ల తరబడి ఎదురవుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం
సుల్తానాబాద్ నవంబర్ 24 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sultanabad Municipality) 7వ వార్డులోని మేకల సదానందం ఇంటి నుండి మేకల స్వామి ఇంటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా పైప్‌లైన్ దెబ్బతినడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు గత పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో,
స్థానిక ప్రజలు ఈ విషయాన్ని 7వ వార్డు కౌన్సిలర్ ఉట్ల వర ప్రదీప్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన కౌన్సిలర్ బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ బిరుదు రాధాకృష్ణ తో, కమిషనర్ రమేష్ తో మాట్లాడి నూతన పైప్‌లైన్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కాలనీవాసులు కౌన్సిలర్ వరప్రదీప్ కు కృతజ్ఞతలు తెలిపారు, ఈకార్యక్రమంలో దాసరి విజయ్, పలువురు వార్డు ప్రజలు పాల్గొన్నారు.