కందకుర్తి త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు

24-11-2026 | 05:31pm

కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు.. శివాలయంలో ప్రత్యేక పూజలు

బోధన్, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం(Kandakurthi Triveni Sangamam) భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పవిత్ర నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం నదిలో తెప్పలు వదులుతూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. పుణ్యస్నానాల అనంతరం నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ శివాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం సీతారాం త్యాగి మహరాజ్ ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో కందకుర్తి త్రివేణి సంగమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మరిన్ని వార్తలు