వరుణ్ రెడ్డి నివాసంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ
24-11-2026 | 05:36pm
అయ్యప్ప స్వాముల శరణుఘోషతో మారుమోగిన ఫార్చ్యూన్ సెవెన్
మణికొండ, నవంబర్ 24 (విజయక్రాంతి): కొకాపేటలోని ఫార్చ్యూన్ సెవెన్(Fortune Seven)లో వరుణ్ రెడ్డి నివాసంలో అయ్యప్ప పడి పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప నామస్మరణ, శరణుఘోషలతో పరిసరాలు మారుమోగాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని పడి పూజను విజయవంతం చేశారు.