గిరిజన అభివృద్ధిపై ఐటిడి అధికారులతో సమీక్ష

30-10-2026 | 06:28pm

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం..

ఉట్నూర్,(విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ(Telangana Tribal Welfare Department) సంచాలకుల ఆధ్వర్యంలో ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు (POs), సహాయ ప్రాజెక్టు అధికారులు (APOs), డిప్యూటీ డైరెక్టర్లు (DDs), జిల్లా గిరిజన అభివృద్ధి పై ఐ టీ ఏ అధికారుల తో పాటు (DTDOs), చీఫ్ ఇంజనీర్లు (CEలు), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (EEలు), అసిస్టెంట్ ఇంజనీర్లతో (AEలు) శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో డైట్ బిల్లులు, కాస్మోటిక్స్, అద్దె చార్జీల చెల్లింపులు, పాఠశాలలు మరియు వసతి గృహాల తనిఖీలు, నిర్వహణ, విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాల సరఫరా, ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు యూనిఫామ్‌ల కుట్టింపు, సరఫరా అంశాలపై సమీక్షించారు.

అలాగే ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, పంపిణీ, జీసీసీ (GCC) పరిధిలో బిల్లుల రీకన్సిలియేషన్ మరియు భూముల లభ్యత, ట్రైకార్ (TRICOR) ద్వారా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల అమలు అంశాలపై చర్చించారు.  

ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA), పీఎం-జన్మన్ (PM-JANMAN) పథకాల కింద చేపట్టిన పనుల పురోగతి, ఖర్చుల వివరాలు, జేజేజీడీ (JJGD) వేడుకలకు సంబంధించి మంజూరైన నిధులు, ఖర్చుల వివరాలపై కూడా అధికారులు సమగ్రంగా సమీక్షించారు. పథకాల అమలు, పనుల పురోగతి, పెండింగ్ సమస్యలు, నిధుల వినియోగంపై అధికారులు సమగ్ర నివేదికలు సమర్పించాలని సమావేశంలో సూచించారు.

మరిన్ని వార్తలు