రైల్వే వంతెన నిర్మాణ పనుల అలసత్వం

30-10-2026 | 07:03pm

నిరసనగా నవంబర్ 2న ఘట్కేసర్ బంద్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనుల అలసత్వం, అలాగే డిస్టిక్ ఆర్టిసి బస్సులు ఘట్కేసర్ పట్టణము గుండా వెళ్లకపోవడానికి నిరసనగా గత రెండు రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దుకాణ సముదాయాల యజమానితో సమావేశం నిర్వహించారు. ఈవిధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టుటకు నిర్ణయించడం జరిగింది.

నవంబర్ 2వ తేదీన (సోమవారం)  ఘట్కేసర్ పట్టణము స్వచ్ఛందంగా బంద్ పాటించవలసిందిగా సమస్త వ్యాపార వాణిజ్య సముదాయాల యజమానులు, విద్యాసంస్థల యజమానులకు చిరు వ్యాపారులకు టాక్సీ ఆటో రిక్షా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ బందును సంపూర్ణంగా పాటించవలసిందిగా నిర్ణయించడం జరిగింది. శనివారము ఉదయం 7.30 కు  ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి మేడం  విచ్చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ రైల్వే గేట్ దగ్గర రావలసిందిగా కోరారు.

మరిన్ని వార్తలు