నిధుల పై రాజకీయ నాయకుల పెత్తనం ఏమిటి.?

30-10-2026 | 07:04pm
  1. గ్రామపంచాయతీ అభివృద్ధి అడ్డుకుంటున్న రాజకీయ నాయకులు
  2. జీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర 

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 30 విజయ క్రాంతి: ఏజెన్సీ ప్రాంతంలో  గ్రామపంచాయతీల నిధుల పై(Gram Panchayat funds) రాజకీయ నాయకుల పెత్తనం ఏమిటని,ఆదివాసి గ్రామాల అభివృద్ధికి అడ్డుపడితే సహించబోమని పూనెం సాయి మండిపడ్డారు.శుక్రవారం  మండలం కమ్మరిగూడెం గ్రామంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.

గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర హాజరై మాట్లాడుతూ ఏజెన్సీప్రాంతమైనవెంకటాపురం మండలంలో గ్రామపంచాయతీలో రాజకీయ పార్టీ నాయకుల పెత్తనం ఏమిటన మండిపడ్డారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రతిక్షణం రాజకీయ పార్టీల నాయకులు  అడ్డుపడుతున్నారని అన్నారు.

అమాయకమైన ఆదివాసీలను రాజకీయ పార్టీల తరఫు నుండి సర్పంచులు గా గెలిపించి.ఎవరైతే పార్టీ అభ్యర్థులు ఉంటారో,వాళ్లు గెలుపొందే వరకే వారి బాధ్యత ఉంటుందని తర్వాత వారి విధులని గ్రామపంచాయతీ అభివృద్ధికి మాత్రమే నిర్వహించాలి తప్ప రాజకీయ పార్టీ నాయకుల మాటలు వినోద్ అన ఆయన అన్నారు.

ఏజెన్సీ గ్రామపంచాయతీలోకి రాజకీయ పార్టీ నాయకులను రాకుండా అడ్డుకున్నప్పుడే ఆదివాసి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన,మన చట్టాలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయని ఆయన అన్నారు.ఆదివాసి గ్రామపంచాయతీలోకి రాజకీయ పార్టీలను రాకుండా బహిష్కరించాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. 

ఏజెన్సీ చట్టాలు నేడు రద్దు చేయాలని రాజకీయ పార్టీలే కంకణం కట్టుకున్నాయనీ ఈ సందర్భంగా తెలిపారు.అలాగే ఆదివాసి అభివృద్ధి జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూనెం విజయ్, ప్రసాద్, కృష్ణార్జునరావు, దినేష్. తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు