సోనాల వాగు ఎండింది కథనానికి స్పందించిన అధికారులు
బోథ్. అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రం(Sonala Mandal Headquarters) సమీపంలో ప్రవహిస్తున్న వాగు ఎండిపోయింది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తపరిచారు. గ్రామస్తుల ఆవేదనను విజయక్రాంతి లో బుధవారం ప్రచురించడం జరిగింది. సోనాల వాగు(Sonala Stream) ఎండింది నీటి కరువు తప్పేట్టు లేదు. అన్న కథనానికి అధికారులు స్పందించారు.
గురువారం వాగు చుట్టూ ఉన్నమోటార్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. రైతులవాగు చుట్టూ ఉన్న మోటార్లు తొలగించాలని తెలపడం జరిగింది. దీనితో రైతులు మోటార్లు తొలగించడంతోపాటు సాగు నీటి వినియోగం నిలిపివేశారు. దీంతో ఎండిన వాగులోకి నీటి ప్రవాహం శుక్రవారం ప్రారంభమైంది. దీంతో గ్రామస్తులు వర్షం వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన వార్త అధికారులను కదిలించడంతోపాటు వాగు నీరు ప్రవహించేలా చేయడం జరిగిందని గ్రామస్తులంటున్నారు.