నల్ల బ్యాడ్జీలతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన
30-10-2026 | 06:51pm
బోథ్,(విజయక్రాంతి) మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తపరిచారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన స్పందించకపోవడంతో రాష్ట్ర జేఏసీపీ మేరకు నిరసన పాటించారు. మొదటిరోజు నిరసనలు మోడల్ స్కూల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.